హిజ్బొల్లా నడ్డి విరిచిన మొస్సాద్​!

Mossad broke Hezbollah!

Sep 22, 2024 - 18:09
 0
హిజ్బొల్లా నడ్డి విరిచిన మొస్సాద్​!
జేరూసలెం: హిజ్బొల్లాపై ఇజ్రాయెల్​ గూడాఛార సంస్థ మొస్సాద్​ కీలక వ్యవస్థపై దాడులు ఒక ప్రణాళిక ప్రకారమే జరిగాయి. తరచూ పేజర్లు, ఫోన్​ లు, ఎలక్ర్టానిక్​ వస్తువులు వాడుతూ ఇజ్రాయెల్​ పై హిజ్భొల్లా దాడులకు తెగబడుతుండడంతో ఆ వ్యవస్థనే పూర్తిగా నష్టం చేయాలని సంకల్పించింది. దీంతో పేజర్లు, వాకీటాకీలు, రేడియో వ్యవస్థలు ఇంకా అనేక వస్తువులలో పేలుడు పదార్థాలు పెట్టే అవకాశం ఉన్నట్లు హిజ్బొల్లా భావిస్తోంది. ఈ నేపథ్యంలో లెబనాన్​ వ్యాప్తంగా ఉన్న ఎలక్ర్టానిక్​ వస్తువుల ఉత్పత్తులను వాడాలంటేనే ఇప్పుడు ప్రజలు జంకే పరిస్థితులు ఏర్పడ్డాయి. భవిష్యత్​ లోనూ వీటిని వాడడం అంత సేప్​ కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో హిజ్బొల్లా కీలక సమాచార వ్యవస్థను ఇజ్రాయెల్​ కుప్పకూల్చినట్లయ్యింది. 
 
దీంతో ఇక హిజ్భొల్లా ఏ దేశ ఎలక్ర్టానిక్​ పరికరాలను వినియోగించాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ లోపు ఇజ్రాయెల్​ తన పని తాను చకచకా చేసుకుంటూ వెళ్లిపోదామని, కీలక నాయకులను మట్టుబెడదామనే ఆలోచనలు ఉన్నట్లుగా పలువురు భావిస్తున్నారు. ఇజ్రాయెల్ ఈ చర్యతో ఇప్పటికే హిజ్బొల్లాకు చెందిన పలువురు కమాండర్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయినా మొస్సాద్​ వారిని వెతకి మట్టుబెట్టగలుగుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇజ్రాయెల్​ మొస్సాద్​ ద్వారా హిజ్బొల్లా నడ్డీ విరిచింది.