హజ్ యాత్రలో 68మంది భారతీయులు మృతి
68 Indians died in Hajj
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: హజ్ యాత్రకు వెళ్లిన 68మంది భారతీయులు మృతిచెందినట్లు విదేశాంగ శాఖకు సమాచారం అందింది. ఈ విషయంపై అధికారులు మాట్లాడుతూ.. సౌదీ విదేశాంగ శాఖ గురువారం వివరాలను వెల్లడించినట్లు పేర్కొంది. అయితే వీరిని భారత్ కు తీసుకువచ్చే విషయంపై మాట్లాడుతూ మక్కా అత్యంత పవిత్రమైన ప్రాంతమని అక్కడి నుంచి మృతదేహాలను తీసుకురాలేమని వారి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేసి అక్కడే వారి సాంప్రదాయాల మేరకు ఖననం చేసే ఏర్పాట్లను చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఎండల తీవ్రత సౌదీలో ఎక్కువగా ఉండడంతో వృద్ధులు, నడివయస్కుల్లో మృతుల సంఖ్య పెరుగుతోందని సౌదీ ప్రకటించింది. కాగా మరణించిన వారిలో ఈజిప్టు, జోర్డాన్, ఇండోనేషియా, ఇరాన్, సెనెగల్, ట్యునీషియా, ఇరాక్ దేశాలకు చెందిన వారు ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు.