రూ. 20వేల కోట్ల రుణాల మోసం 35 చోట్ల కొనసాగుతున్న ఈడీ దాడులు
Rs. 20,000 crores loan fraud ongoing ED raids at 35 places
నా తెలంగాణ, న్యూఢిల్లీ: రూ. 20వేల కోట్ల బ్యాంకు రుణాల మోసం కేసులో ఈడీ గురువారం కూడా దాడులు కొనసాగిస్తోంది. ఈ మోసం వల్ల ప్రభుత్వానికి దాదాపు రూ. 10 నుంచి రూ. 15వేల కోట్ల నష్టం వాటిల్లినట్లుగా ఈడీ గుర్తించింది. ఎసీఐఎల్ లిమిటెడ్‌పై మనీలాండరింగ్ కింద ఎఫ్ ఐఆర్ నమోదు చేసింది. ఢిల్లీ, ముంబై, నాగ్ పూర్ లలోని 35 చోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహిస్తోంది. సంస్థ ప్రమోటర్లైనా ఆమ్టెక్ గ్రూప్ దాని డైరెక్టర్లు అరవింద్ ధామ్, గౌతమ్ మల్హోత్రా, ఇతరుల నివాసాలు కార్యాలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. వీరు బినామీ సంస్థలను నెలకొల్పి బ్యాంకుల ద్వారా రూ. 20వేల కోట్ల మోసానికి పాల్పడ్డారని ఈడీ చెబుతోంది. ఈ మనీలాండరింగ్ పై పూర్తి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు కూడా ఈడీని ఆదేశించింది. అయితే నిందితులు బ్యాంకుల ద్వారా తీసుకున్న మొత్తాన్ని బినామీ సంస్థల ద్వారా నిదులను దారి మళ్లించి రియల్ ఎస్టేట్, విదేశాల్లో పెట్టుబడులు, వెంచర్లలో పెట్టుబడులు పెట్టినట్లుగా ఈడీ గుర్తించింది. బ్యాంకుల ద్వారా ఎక్కువగా రుణాలు పొందేందుకు తప్పుడు లెక్కలు చూపించారని ఈడీ గుర్తించింది. అయితే దాడులపై ఇంకా పూర్తి సమాచారాన్ని ఈడీ పంచుకోలేదు.