ప్రజలతో మమేకమై సేవలందించాలి
రామగుండం సీపీ శ్రీనివాస్
నా తెలంగాణ, రామకృష్ణాపూర్: పోలీసులు ప్రజలతో మమేకమవుతూ సేవలందించాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ అన్నా రు. శనివారం రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించారు. పోలీస్ స్టేషన్ రికార్డులను పరిశీలించి సిబ్బంది వివరాలను ఎస్సై రాజశేఖర్ ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్టేషన్ లో చాలా రకాల రికార్డులను నమోదు చేయవలసి ఉంటుందని మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పోలీసుల విధివిధానాలు ఇప్పటికిప్పుడు మారాలని అన్నారు. డయల్ 100కు వచ్చే ఫిర్యాదులపై వేగంగా స్పందించాలని పేర్కొన్నారు. పోలీసులు క్రమశిక్షణతో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆయన సూచించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉండాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, స్పెషల్ బ్రాంచ్ ఏసిపి రాఘ వేంద్రరావు, మందమర్రి సీఐ శశిథరూర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.