నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి
వైద్యురాలి హత్యపై ప్రధానికి వైద్యుల లేఖ ఐఎం 24 గంటల సమ్మె ప్రకటన
కోల్‌కతా: కోల్‌కతా వైద్యురాలి అత్యాచారం, హత్య కేసులో న్యాయం చేయాలని కోరుతూ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ డెర్మటాలజిస్ట్స్, వెనిరియోలాజిస్టులు, లెప్రోలాజిస్టులు ప్రధాని మోదీకి శుక్రవారం లేఖ రాశారు. వెంటనే పూర్తి విచారణ చేపట్టి నిందితులు ఎంతమంది ఉన్నా వారిని అత్యంత కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని, అదే సమయంలో వైద్యులకు పూర్తి భద్రత కల్పించాలని లేఖలో పేర్కొంది. మరోవైపు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆగస్ట్ 17 తేదీ ఉదయం 6 గంటల నుంచి ఆగస్ట్ 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు దేశ వ్యాప్తంగా వైద్యుల సేవలను నిలిపివేస్తునట్లు సమ్మెకు దిగుతున్నట్లు అసోసియేషన్ స్పష్టం చేసింది.