ఫ్రాన్సిస్ కీ వంతెనను ఢీకొన్న భారీ నౌక
కుప్పకూలిన వంతెన పలువురి గల్లంతు విచారణ చేపట్టిన అధికారులు
న్యూయార్క్: అమెరికా మేరీల్యాండ్పటాప్స్కో నదిపై ఫ్రాన్సిస్ కీ వంతెనను ఓ భారీ నౌక ఢీ కొంది. అమెరికన్ కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 1.30 గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో బ్రిడ్జి పూర్తిగా కూలిపోయింది. వంతెనను ఢీ కొన్న తరువాత ఓడలో మంటలు చెలరేగి మునిగిపోయింది. ఇందులో ఉన్న సిబ్బంది అంతా సురక్షితంగా బయటపడ్డారు. కాగా వంతెనపై ప్రయాణిస్తున్న వాహనాలలో ఉన్న కొద్ది మంది గల్లంతైనట్లు అధికారులు పేర్కొన్నారు. వారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని పేర్కొన్నారు. ఢీకొన్న నైక సింగపూర్ఫ్లాగ్డ్ షిప్ అని శ్రీలంక రాజధాని కొలంబో వెళుతోందని ఈ నౌకను డాలీ అని కూడా పిలుస్తారని అధికారులు పేర్కొన్నారు. ఈ ఓడ 948 అడుగుల పొడవు ఉందని తెలిపారు. 1977లో పటాప్‌స్కో నదిపై ఫ్రాన్సిస్ కీ వంతెన నిర్మాణం జరిగిందని అధికారులు వివరించారు. ప్రమాదంపై పూర్తి విచారణ చేపట్టామన్నారు.