నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: జమ్మూకశ్మీర్ ఎమ్మెల్యే దేవేంద్ర సింగ్ రాణా (59) మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. అనారోగ్యంతో హరియాణాలోని ఫరీదాబాద్ లో ఓ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. ఈయన కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ సోదరుడు. శుక్రవారం అధికారిక లాంఛనాలతో దేవేంద్రసింగ్ అంత్యక్రియలను నిర్వహించారు. రాణా అనుభ అనుభవజ్ఞుడైన నాయకుడు, జమ్మూ కాశ్మీర్ పురోగతి కోసం శ్రద్ధగా పనిచేశారని కొనియాడారు. బీజేపీని బలోపేతం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించారని ఆయన కుటుంబ సభ్యులకు, మద్దతుదారులకు సానుభూతిని వ్యక్తం చేశారు.
దేవేంద్రసింగ్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరఫున అభ్యర్థిగా ఎన్నికై నగ్రోటా నుంచి భారీ మెజార్టీ సాధించి విజయం సాధించారు. జమ్మూలోని డోగ్రా కమ్యూనిటీకి బలమైన గొంతుక అని అనిపించుకున్నారు. ఈయన మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.