24 గంటల్లో మూడు డ్రోన్లు స్వాధీనం
చైనా, పాక్ లవేనన్న భద్రతా దళాలు
హరియాణా: భారత్–పాక్ సరిహద్దుల్లో 24 గంటల్లో మూడు చైనాకు చెందిన డ్రోన్లను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. శనివారం ఉదయం చైనాకు చెందిన డీజేఐ మావిక్–3 క్లాసికల్ డ్రోన్ ను తార్న్ తరన్ జిల్లాలోని నూర్వాలా గ్రామ సమీపంలో పొలంలో డ్రోన్ ను స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా దళాలు ప్రకటించారు. ఇదే జిల్లాలో మస్త్ గర్ గ్రామం నుంచి కూడా పాక్ కు చెందిన డ్రోన్ ను స్వాధీనం చేసుకున్నారు. మరో చైనీస్ డ్రోన్ డీజీఐ మ్యాట్రిక్–300ను స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా దళాలు ప్రకటించాయి. గత 24 గంటల్లో మూడు డ్రోన్లను స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారి అని అధికారులు ప్రకటించారు. అయితే ఈ డ్రోన్లు చైనా, పాక్ లకు సంబంధించినవే అయినా వీటిని ఏ లక్ష్యంతో భారత్ లో పంపారనేది గుర్తించాల్సి ఉందన్నారు. అయితే స్వాధీనం చేసుకున్న డ్రోన్ లో ఎరుపు రంగు కవర్ ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. దీనిపై దర్యాప్తు చేపట్టామన్నారు.
గతంలో పంపిన డ్రోన్ల ద్వారా స్మగ్లింగ్, మత్తుపదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ దిశగా దర్యాప్తు చేపట్టామన్నారు.