ఉత్తమ ఫోటోగ్రాఫర్​ గా శ్రీకాంత్​

Srikanth as the best photographer

Sep 27, 2024 - 20:36
 0
ఉత్తమ ఫోటోగ్రాఫర్​ గా శ్రీకాంత్​

నా తెలంగాణ, పాపన్నపేట: మాటలు చెప్పలేనివి కొన్నిసార్లు దృశ్యాలు చెబుతాయని మెదక్​ జిల్లా కలెక్టర్​ రాహుల్​ అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఫోటోగ్రఫీ పోటీల్లో ఉత్తమ ఫోటోగ్రాఫర్​ పుర్ర శ్రీకాంత్​ (పాపన్నపేట)కు ఉత్తమ అవార్డును శుక్రవారం అందజేశారు. ప్రశంసా పత్రంతోపాటు మెమొంటోను బహూకరించారు. ఏడుపాయల క్షేత్రంలోని పలు దృశ్యాలను శ్రీకాంత్​ చిత్రీకరించిన విధానాన్ని కలెక్టర్​ కొనియాడారు. ద్వితీయ స్థానం ఈశ్వర్​, తృతీయ దర్శన్​, నాలుగో స్థానం ప్రతాప్​ లు అందుకున్నారు.