నీటి సమస్యకు యువ నాయకుడి పరిష్కారం 

సొంతడబ్బుతో మోటారు ఏర్పాటు

Aug 22, 2024 - 17:50
 0
నీటి సమస్యకు యువ నాయకుడి పరిష్కారం 

నా తెలంగాణ, షాద్ నగర్: షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండల పరిధిలోని బొదునంపల్లి గ్రామానికి గత ఐదు రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో గ్రామస్తులు తీవ్ర నీటి సమస్యను ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న గ్రామ యువ నాయకుడు పిప్పల్ల శేఖర్ తన సొంత నిధులు లక్ష పది వేల రూపాయలు వెచ్చించి గ్రామంలో మూడు సింగిల్ ఫేస్ మోటార్లను బిగించారు. గురువారం గ్రామస్తులతో కలిసి వాటిని ప్రారంభించారు. నీటి సమస్యను పరిష్కరించడానికి సొంత నిధులతో మోటార్లను బిగించడం పట్ల గ్రామస్తులు శేఖర్ ను అభినందించారు. గ్రామ అభివృద్ధి కోసం మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. 

ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి సాయి ప్రసాద్ రెడ్డి, గ్రామస్తులు ఎన్నం లింగారెడ్డి, ఆంజనేయులు గౌడ్, నీల పాండు, చాకలి బాలరాజు, చాకలి వెంకటయ్య, బాయ్ గడ్డ ఐలయ్య, బాయి గడ్డ తిరుపతయ్య, తుడుం పెంటయ్య, తర్ర లింగయ్య, లక్ష్మయ్య మల్లేష్, చెన్నయ్య, లక్ష్మయ్య ,గణేష్, కృష్ణయ్య, యాదయ్య, చంద్రయ్య, వెంకయ్య, మల్లేష్, రవి గౌడ్, రమేష్, రాజు, కుమార్, కోటీశ్వర్, శ్రీను, శివశంకర్, మల్లేష్, రాధాకృష్ణ, శ్రీకాంత్ రెడ్డి, శ్రీకాంత్ పద్మమ్మ, కలమ్మ, జయమ్మ, గ్రామస్తులు పాల్గొన్నారు.