స్పీకర్​ ప్రత్యేక పూజలు

Speaker special worship

Sep 18, 2024 - 16:27
Sep 18, 2024 - 16:38
 0
స్పీకర్​ ప్రత్యేక పూజలు

నా తెలంగాణ, మెదక్: అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ బుధవారం శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెదక్ జిల్లా కుల్చారం మండలం రంగంపేట శ్రీశ్రీశ్రీశ్రీశ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి ఆశ్రమానికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ స్పీకర్ కు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. స్వామి చాతుర్మసా దీక్ష సందర్బంగా ఆశ్రమంలో పౌర్ణమి పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపండితులు స్పీకర్ కు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, నర్సాపూర్ ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి ఉన్నారు.