జమిలికి సై

Cabinet approw One Nation One Election

Sep 18, 2024 - 15:18
Sep 18, 2024 - 16:56
 0
జమిలికి సై
ప్రధాని అనుమతి కేబినెట్ ఆమోదముద్ర
47 పార్టీల్లో 32 పార్టీలు ఓకే
స్పందించిన15 పార్టీలు
మార్చిలో నివేదిక సమర్పించిన రామ్ నాథ్ కోవింద్ కమిటీ
జమిలిపై నోరు మెదపని టీడీపీ
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించిన ఒకరోజు తరువాత జమిలి (వన నేషన్ వన్ ఎలక్షన్) ఎన్నికలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దీంతో జమిలి ఎన్నికలపై ఉన్న సందిగ్ధత వీడింది. జమిలి ఎన్నికల ప్రతిపాదనకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటనని కేబినెట్ బుధవారం ఆమోద ముద్ర వేసింది. బుధవారం కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. జమిలి ఎన్నికల అంశంపై 62 పార్టీలను సంప్రదించగా 47 పార్టీలు స్పందించాయి. ఇందులో 32 పార్టీలు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు మద్ధతు పలికాయి. 15 పార్టీలు జమిలి ఎన్నికలపై ఇప్పటివరకు స్పందించలేదు. 
 
మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కోవింద్ ప్రతిపాదన కమిటీ 'వన్ నేషన్ వన్ ఎలక్షన్' (జమిలి) సాధ్యాసాధ్యాలపై మార్చిలో తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ ప్రతిపాదనకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. రూపొందించినపతి రాంనాథ్ కోవింద్ నివేదికలో ఇచ్చిన సూచనల ప్రకారం మొదటి దశ లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలి. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి 100 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను కూడా నిర్వహించాలని కమిటీ సిఫార్సు చేసింది. దీంతో దేశంలో మొత్తం నిర్ణీత వ్యవధిలో అన్ని స్థాయిల్లో ఎన్నికలు నిర్వహించుకునే అవకాశం ఏర్పడింది. 
 
అత్యధిక ప్రజాస్వామ్య దేశంలో ఐదేళ్ల పాటు ఎన్నికల ప్రచారం కొనసాగకూడదు. ఈ ప్రక్రియను కేవలం మూడు, నాలుగు నెలల్లోనే ముగించాలని అభిప్రాయపడ్డారు. దీనితో భారీ ఎత్తున ఎన్నికల ఖర్చు మిగుల పాటు. 
 
రాష్ట్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో బీజేపీతో పాటు చంద్రబాబు నాయుడు టీడీపీ, నితీష్ కుమార్‌కు చెందిన జేడీయూ, చిరాగ్ పాశ్వాన్‌కు చెందిన ఎల్జేపీ (ఆర్) పెద్ద పార్టీలు. జేడీయూ, ఎల్జేపీ (ఆర్‌)లు జమిలికి అంగీకరించగా, టీడీపీ మాత్రం ఎలాంటి సమాధానం చెప్పలేదు. కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, సీపీఎం, బీఎస్పీ సహా 15 పార్టీలు దీనిని వ్యతిరేకించాయి. జార్ఖండ్ ముక్తి మోర్చా, టీడీపీ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ సహా 15 పార్టీలకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.