క్యాబినెట్ సెక్రెటరీగా సోమనాథన్
పదవీ బాధ్యతల స్వీకరణ

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: క్యాబినెట్ నూతన సెక్రెటరీగా సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ టీవీ సోమనాథన్ శుక్రవారం పదవీ బాధ్యతలను స్వీకరించారు. తమిళనాడు కేడర్ 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. గతంలో ప్రధాని కార్యాలయంలో జాయింట్ సెక్రెటరీ, అడిషనల్ సెక్రెటరీ సహా అనేక ముఖ్యమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. కార్పొరేట్ వ్యవహారాల శాఖలో కూడా పనిచేశారు. క్యాబినెట్ సెక్రెటరీగా రాజీవ్ గౌబా పదవీ విరమణ చేయడంలో టీవీ సోమనాథన్ ను కేంద్రం ఈ పదవిలో నియమించింది.