నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: పాక్ తో చర్చల యుగం ముగిసిందని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జై శంకర్ అన్నారు. ఇక వారి చర్యలకు ప్రతిచర్యలు మాత్రమే ఉంటాయని అన్నారు. న్యూ ఢిల్లీలోని శుక్రవారం జరిగిన పుస్తకావిష్కరణ సందర్భంగా జై శంకర్ ప్రసంగించారు. పాక్ తో వ్యవహరించే విషయంలో భారత్ ఏం ఉవ్విళూరడం లేదన్నారు. ప్రతికూల చర్యలను మానుకుంటే మంచిదన్నారు. బంగ్లాదేశ్ లో రాజకీయ మార్పులపై భారత్ దృష్టిని సారించిందన్నారు. అదే సమయంలో మాల్దీవులుతోనూ సత్సంబంధాలపై భారత విధానం స్పష్టంగా ఉందన్నారు. సామాజిక స్థాయిలో ఆఫ్ఘాన్ తో సత్సంబంధాలున్నాయని, ఇరుదేశాల విధానంపై మరోమారు సమీక్షించాల్సి ఉందన్నారు. ప్రతీ దేశానికి పొరుగు దేశాలతో ఇలాంటి అంశాల్లో అనేక సవాళ్లతో ముడిపడి ఉంటాయని ఇందులో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జై శంకర్ తెలిపారు.