హరియాణా ఎన్నికల తేదీ మార్పు
అక్టోబర్ 5న ఓటింగ్, 8న కౌంటింగ్
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: హరియాణా ఎన్నికల తేదీ మారింది. అక్టోబర్ 1న కాకుండా అక్టోబర్ 5న ఎన్నికల నిర్వహణ, అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు ఉంటుందని ఈసీ స్పష్టం చేసింది. అక్బోఱ్ 2న గురు జంబేశ్వర్ పర్వదినాన్ని వైభవంగా నిర్వహించారు. 1న ఎన్నికలు ఉంటే ఈ పర్వదినానికి ఆటంకం ఏర్పడుతుందని హరియాణాలోని బిష్ణోయ్ కమ్యూనిటీ, బీజేపీ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి పలుమార్లు విజ్ఞప్తులు చేశాయి. ఈ వేడుకలో హరియాణాతోపాటు పంజాబ్, రాజస్థాన్ కు చెందిన ప్రజలు పాల్గొంటారు. ఈ క్రమంలో చాలామంది ఓటుహక్కుకు దూరం అయ్యే అవకాశం ఉందని ఈసీకి విజ్ఞప్తి చేశారు. తొలుత ఈసీ తేదీని మార్చేందుకు తిరస్కరించినా ప్రజల ద్వారా కూడా వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని ఎన్నికల తేదీని మారుస్తున్నట్లు ప్రకటించింది.