పెరగనున్న భానుడి భగభగలు స్కైమేట్హెచ్చరికలు
దేశంలో నానాటికి భానుడి భగభగలు పెరిగిపోతున్నాయి. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్ఈ) నివేదికపై వాతావరణ సంస్థ స్కైమేట్వనివారం హెచ్చరికలను జారీ చేసింది.
న్యూఢిల్లీ: దేశంలో నానాటికి భానుడి భగభగలు పెరిగిపోతున్నాయి. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్ఈ) నివేదికపై వాతావరణ సంస్థ స్కైమేట్వనివారం హెచ్చరికలను జారీ చేసింది. దేశంలోని 12 రాష్ర్టాల్లో హీట్‌వేవ్‌ల ప్రభావం ఉండనున్నట్లు పేర్కొంది. వేడిగాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, బిహార్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత 43 డిగ్రీలకు చేరుకుంది. రానున్న రోజుల్లో ఇక్కడ వేడి మరింతగా పెరుగుతుందని తెలిపింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, అసోం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, కేరళ, సిక్కింలో వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని స్కైమేట్స్పష్టం చేసింది. కొండ ప్రాంతాలైన జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో మంచు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. పలు జిల్లాలు ఇప్పటికే హీట్‌వేవ్ అలర్ట్‌ను ప్రకటించాయి. పాఠశాలల సమయాన్ని కుదించాయి.