కేంద్రమంత్రి అనుప్రియకు జడ్ కేటగిరి భద్రత
నా తెలంగాణ, ఢిల్లీ: అప్నాదళ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ కు జడ్ కేటగిరి భద్రతను పెంచుతున్నట్లు శనివారం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ముందు హోం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అప్నాదళ్ (ఎస్) నేత, కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్‌కు జెడ్ కేటగిరీ భద్రత లభించింది. అంతకుముందు ఆయనకు వై కేటగిరీ భద్రత ఉండేది. ఇంతకుముందు మంత్రి అనుప్రియకు వై కేటగిరి కింద కేంద్రం భద్రతను కల్పించింది. ప్రస్తుతం జడ్ కేటగిరి కింద 22 మంది రక్షణ సిబ్బంది ఆమెకు భద్రతా విధుల్లో నిరంతరం కొనసాగనున్నారు. ఇందులో ఆరుగురు ఎన్ఎస్జీ కమాండోలు, పోలీసులు, ఐటీబీపీ, సీఆర్పీఎఫ్ విభిన్న భద్రతా దళాలకు చెందిన అధికారులు మంత్రికి భద్రతను అందించనున్నారు.
అనుప్రియా పటేల్..
2014లో ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ లోక్ సభ స్థానానికి అప్నాదళ్ నుంచి పోటీ చేశారు. ఎన్డీయేలో భాగస్వామి కావడంతో అనుప్రియకు కేంద్రమంత్రి పదవికి ఎంపికయ్యారు. ఈమె తండ్రి యాష్కే డాక్టర్ సోనెలాల్ పటేల్ అప్నాదళ్ పార్టీ వ్యవస్థాపకుడు.