ద్రవ్యోల్బణం నియంత్రణలో గత ప్రభుత్వాలు విఫలం
పసిడిని వెనక్కి రప్పిస్తూ ఆర్థిక ప్రగతికి భరోసా
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: భారత్ లో పసిడి కొరతకు గత ప్రభుత్వ విధానాలే కారణమా? దేశంలో మౌలిక సదుపాయాల కల్పన, ఆర్థిక ఖజానాపై భారాలు, అప్పులు పెరగడం వంటి వాటితో అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణాన్ని అదుపుచేయలేని పరిస్థితిలో ఆయా దేశాలు తమ వద్ద ఉన్న బంగారాన్ని వివిధ దేశాలకు తాకట్టుపెడుతుంటాయి. దీంతో ఆర్థికభారం నుంచి అప్పటికప్పుడు తప్పించుకున్న భవిష్యత్ లో ఇవే పరిణామాలు ఆ దేశాన్ని కుదేల్ చేసే స్థాయికి కూడా ఎదగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. విదేశీ మారకద్రవ్య ఎగుడుదిగుడుల నేపథ్యంలో ప్రతీదేశం కూడా బంగారాన్ని లండన్ లో తాకట్టుపెడుతుంటాయి. బంగారం నిల్వలు ఆయా దేశాల ఆర్థిక భారాన్ని కూడా సూచిస్తుంటాయి.
భారత్ లోనూ ఇదే జరిగింది. స్వాతంత్ర్యం సిద్ధించినప్పటి నుంచి భారత్ భారీగా బంగారాన్ని లండన్ లోని బ్యాంకులలో తాకట్టుపెట్టింది. తద్వారా అప్పటికప్పుడు విదేశీ ద్రవ్యనిల్వలను పెంచుకుంటూ పోయింది. ఫలితంగా విదేశాల్లో భారత్ బంగారం భారీగా నిల్వలు పేరుకుపోయేందుకు కారణంగా నిలిచాయి. ప్రధాని మన్మోహన్ సింగ్, పి.వి. నరసింహారావు హయాంలో కూడా విదేశాల్లో భారీగా బంగారాన్ని లండన్ బ్యాంకుల్లో తాకట్టుపెట్టారు. అప్పటికప్పుడు ఆయా సంక్షోభాల నుంచి ఆ ప్రభుత్వం గట్టెక్కినా ఆనక ఆ బంగారాన్ని తిరిగి తీసుకురావడంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ (బీజేపీ) ప్రభుత్వం కనకాన్ని తీసుకువచ్చే బాధ్యతను తీసుకుంది. మోదీ నేతృత్వంలోని విదేశాంగ విధానంతో క్రమేణా అన్ని విభాగాల్లోనూ వృద్ధిని నమోదు చేస్తూ ప్రపంచవ్యాప్త దేశాలతో సత్సంబంధాలను సృష్టించుకుంటోంది. తద్వారా వ్యాపార, వాణిజ్య అవసరాల్లో భారీ పెరుగుదల చోటు చేసుకొని 11వ స్థానం నుంచి ఏకంగా ఐదో స్థానానికి ఎగబాకింది. రానున్న సమయంలో మూడో స్థానానికి వచ్చేందుకు మోదీ ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టి మూడు రెట్ల వేగంతో పనిచేస్తుంది.
ఈ నేపథ్యంలో పసిడి (కనకం) తాకట్టుపై మోదీ ప్రభుత్వం దృష్టి సారించింది. క్రమేణా బంగారాన్ని వెనక్కి తీసుకువచ్చే నిర్ణయాలను తీసుకుంటుంది. నివేదికల ప్రకారం ఆర్బీఐ వద్ద 822.1 టన్నుల బంగారం ఉంది. ఇందులో 408.31 టన్నుల బంగారం ఉండగా, విదేశీ బ్యాంకుల్లో 387.26 టన్నులు, మరో బ్యాంకులో 26.53 టన్నుల బంగారం డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. మోదీ ప్రభుత్వ హయాంలో ద్రవ్యోల్బణం స్థిరంగా ఉండడంతోపాటు వృద్ధిని సాధిస్తుండడంతో పసిడిని భారత్ కు రప్పిస్తూ ఆర్బీఐ వద్ద నిల్వ చేస్తోంది. విదేశాల్లో ఉన్న బంగారాన్ని మోదీ ప్రభుత్వం వెనక్కు తీసుకురావాలనే సంకల్పంతో ముందుకు వెళుతుంది.