దానా హై అలర్ట్​

25న తీరం దాటనుందని ఐఎండీ హెచ్చరికలు

Oct 23, 2024 - 16:36
 0
దానా హై అలర్ట్​

ఒడిశాలో రైళ్ల రద్దు, పాఠశాలలకు సెలవు
10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించే యోచనలో ఒడిశా ప్రభుత్వం
సిద్ధంగా ఉండాలని అధికారులకు సీఎం మమత బెనర్జీ ఆదేశం

భువనేశ్వర్​: దానా తుపాను ఈ నెల 25న తీరం దాటనుందని బుధవారం వాతావరణ శాఖాధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్​ ప్రభుత్వాలు అలర్ట్​ అయ్యాయి. 25న పలు రైళ్లను రద్దు చేశాయి. పాఠశాలలకు సెలవు ప్రకటించాయి. తీర ప్రాంతాల్లోని 10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని యోచిస్తున్నాయి. ఒడిశా మీదుగా వెళ్లే 198 రైళ్లను ఈస్ట్​ కోస్ట్​ రైల్వే రద్దు చేసింది. శుక్రవారం వేకువజామున తుపాను తీరం దాటనుందని, 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఒడిశా ప్రభుత్వ 14 జిల్లాల్లోని మూడు వేల గ్రామాల నుంచి 10 లక్షల మందిని సహాయక శిబిరాలకు తరలించాలనే యోచనలో ఉంది. మరోవైపు తుపాను తీవ్రత దృష్ట్యా జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని పశ్చిమ బెంగాల్​ సీఎం మమతా బెనర్జీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.