సీఎం కేజ్రీవాల్ రాజీనామా! రెండు రోజుల తరువాత
సీఎం సంచలన ప్రకటన
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. ఆదివారం ఆప్ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. రెండు రోజుల తరువాత సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు.
కేజ్రీవాల్ నిజాయితీపరుడని ప్రజలు తీర్పు ఇచ్చే వరకు తాన కుర్చీలో కూర్చోనన్నారు. సత్యేంద్రజైన్, అమానతుల్లాఖాన్ లు కూడా త్వరలోఏ జైలు నుంచి బయికి వస్తారన్నారు. ఢిల్లీ ప్రజలు తమ కోసం ప్రార్థించారని వారికి తన ధన్యవాదాలు తెలిపారు. జైలులో తాను రామాయణం, గీత, భగత్ సింగ్ లాంటి పుస్తకాలను చదివి తన వెంట తెచ్చుకున్నానని తెలిపారు.