షిండే, ఫడ్నవీస్ భేటీ సీఎం పదవిపై నెలకొన్న ఉత్కంఠ
Shinde, Fadnavis meet, there is excitement over the post of CM
ముంబాయి: ఏక్ నాథ్ షిండేను కలిసేందుకు బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం రాత్రి ఆయన ఇంటికి చేరుకున్నారు. ఇరువురి మధ్య దాదాపు అరగంటపాటు భేటి అయ్యారు. మహారాష్ర్ట సీఎం పదవిపై ఉత్కంఠ నెలకున్న నేపథ్యంలో ఈ భేటికి ప్రాధాన్యత ఏర్పడింది. ఎన్నికల తరువాత వీరిద్దరూ కలవడం ఇది రెండోసారి. ఫడ్నవీస్ కంటే ముందు షిండే బీజేపీ నేత గిరీష్ మహాజన్ తో కూడా భేటీ అయ్యారు. మంత్రివర్గ విభజనపై బంగ్లాలోని ఛాంబర్ రూమ్ లో చర్చ జరిగింది. మధ్యాహ్నం షిండే ఆసుపత్రిలో చికిత్స పొంది నేరుగా తన ఇంటికి చేరుకున్నారు. తన ఆరోగ్యం బాగానే ఉందని రోటిన్ చెకప్ కు వెళ్లానని మీడియాకు షిండే వివరించారు. మరోవైపు బుధవారం బీజేపీ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. సీఎం, మంత్రి పదవులపై ఇరువురు నాయకులు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.