చైనా పేర్లు.. మండిపడ్డ భారత్​

అరుణాచల్​ఎప్పటికీ భారత్​లో అంతర్భాగమేనన్న విదేశాంగ శాఖ

Apr 2, 2024 - 18:45
Apr 2, 2024 - 19:57
 0
చైనా పేర్లు.. మండిపడ్డ భారత్​

న్యూఢిల్లీ: భారత్‌లో అంతర్భాగమైన ప్రదేశాలకు పేర్లు పెట్టడాన్ని భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. అరుణాల్ ప్రదేశ్ తమదని వాదిస్తున్న చైనా 30 పేర్లతో జాబితా విడుదల చేసిన నేపథ్యంలో మంగళవారం భారత విదేశాంగ శాఖ తీవ్రంగా మండిపడింది. భారత్‌లో అంతర్భాగమైన ప్రాంతాలకు చైనా పేరు పెట్టడం తన తెలివిలేని ప్రయత్నమేనని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ లు ఉన్నారు. తాను ఒకరి ఇంటిపేర్లను మారిస్తే ఆ ఇళ్లు తన సొంతం అవుతుందా? అని ప్రశ్నించారు. ఎప్పటికీ అరుణాచల్ భారత్‌లో అంతర్భాగమేనని స్పష్టం చేశారు. చైనా అయినా ఎన్ని పేర్లు పెట్టుకున్నా అది భారత్ పై ఎలాంటి ప్రభావం చూపబోదన్నారు. వాస్తవాధీనరేఖ వద్ద భారత సైన్యం కాపలా ఉందని మంత్రి స్పష్టం చేశారు. చైనా ఇప్పటికైనా ఉద్రిక్తతలు తలెత్తే చర్యలను మానుకుంటే మంచిదని తెలిపింది.