12 భాషల్లో పాట విడుదల

మోదీ అభివృద్ధి, దేశ ఐక్యత సూచికనే ప్రామాణికత పథకాలు, పనుల వివరణ, మహిళా శక్తికి ప్రాధాన్యం 

Apr 10, 2024 - 18:16
 0
12 భాషల్లో పాట విడుదల

న్యూఢిల్లీ: దేశంలోని 2024 ఎన్నికల సందర్భంగా బీజేపీ పార్టీ వినూత్న సరళీలో ప్రచారంలో దూసుకుపోతోంది. బుధవారం 12 భాషల్లో భారత అభివృద్ధి ముఖ చిత్రాన్ని చూపే కొత్త పాటను పార్టీ విడుదల చేసింది. ఈ పాటలో ఆద్యంతం మోదీ చేసిన అభివృద్ధిని చూపించారు. కశ్మీర్​ నుంచి కన్యాకుమారి వరకూ భారత ఐక్యతను ప్రదర్శించారు. 2014కు ముందు భారత ముఖ చిత్రం ఎలా ఉందో అనే దాన్ని వివరిస్తూ  పాట ప్రారంభం అవుతుంది. అటు పిమ్మట 2014లో ప్రధాని మోదీని ప్రజలు ఎన్నుకున్నాక భారత అభివృద్ధి ఎలా కొనసాగిందనే విషయాన్ని పాట రూపంలో చూడచక్కగా వివరించారు. మోదీ నేతృత్వంలో మారిన భారతాన్ని, మారబోతున్న భారతాన్ని ఆయా భాషల్లో చెవులకింపుగా పాట రూపంలో వివరించారు.

భారత ప్రజలు భిన్నత్వంలో కూడా ఐక్యతను ఎలా కాపాడుకుంటున్నారనే విషయాన్ని వివరించారు. ఈసారి కూడా దేశ ప్రజలు ప్రధాని మోదీనే ఎన్నుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు పాట చిత్రీకరించారు. పాట 3 నిమిషాల 19 సెకన్ల నిడివితో విడుదల చేశారు. 

ప్రధాని పథకాల వివరణ..

ఉజ్వల గ్యాస్​, నల్​ సే జల్​, సూర్యఘర్​, డ్రోన్​ దీదీ, లక్ష్పతీ దీదీ, జీ–20 నిర్వహణ, స్టేడియం, పార్లమెంట్​, అయోధ్య నిర్మాణాలు, అన్ని ప్రాంతాల సంస్కృతి సాంప్రదాయాల వేషధారణ, చిత్రాలు దక్షిణాది ప్రాంతాలలోని కల్చరల్​, సర్దార్​ పటేల్​ విగ్రహం స్థాపన తదితర వివరాలను పాట రూపంలో వివరించారు. ఇక ముఖ్యంగా కశ్మీర్​ లో భారత జెండా ఎగిరే ప్రాంతాన్ని సూచిస్తూ ఐక్యతను ప్రదర్శించడం ఆద్యంతం ఆకట్టుకుంటోందనే చెప్పొచ్చు.