భారత్ డిజిటలైజేషన్​ భేష్​

యూఎన్​జీఏ అధ్యక్షుడు డెన్నిస్​ఫ్రాన్సిస్​

Apr 7, 2024 - 17:02
 0
భారత్ డిజిటలైజేషన్​ భేష్​

న్యూఢిల్లీ: భారత్​ డిజిటలైజేషన్​ ప్రక్రియను చూసి తనకు ఆశ్చర్యం వేస్తోందని యూఎన్​జీఏ (ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు) డెన్నిస్​ ఫ్రాన్సిస్​ అన్నారు. ఇంత వేగంగా సాంకేతిక, పెట్టుబడులపై డెన్నిస్​ హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం ఐక్యరాజ్యసమితిలో డిజిటలైజేషన్​ ప్రక్రియపై చర్చ సందర్భంగా డెన్నిస్​ మాట్లాడారు. భారత్​లో వేగంగా డిజిటలైజేషన్​ చోటు చేసుకోవడంతో ఆర్థిక ప్రోత్సాహం లభిస్తోందన్నారు. పేదరికాన్ని తగ్గించేందుకు కారణమవుతుందని పేర్కొన్నారు. గ్లోబల్​ కమ్యూనిటీతో భారత్​ సాంకేతికతను పంచుకోవడం విశేషమని తెలిపారు. భారతదేశంలోని మారుమూల ప్రాంతాల్లోని మహిళలు, రైతులు తమ ఇళ్లు, పొలాల పనులను చేసుకుంటూనే సాంకేతికతతో జోడించడం భారత ప్రభుత్వం సాధించిన విజయంగా ఆయన తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచానికి పోటీనిచ్చే స్థాయికి ఎదిగిందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. అభివృద్ధి దిశలో భారత్​ ఉందని పేర్కొన్నారు. భారత్​ సరళీకృతమైన విధానాలను మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని డెన్నిస్​ ఫ్రాన్సిస్​ స్పష్టం చేశారు.