అటల్​ ను గుర్తు చేసిన ఫరూక్​

Farooq reminded Atal

Oct 11, 2024 - 17:44
 0
అటల్​ ను గుర్తు చేసిన ఫరూక్​

జై శంకర్​ పాక్​ కు వెళ్లడం శుభపరిణామం
పొరుగుదేశంతో కలిసి పనిచేస్తే మరింత అభివృద్ధి సాధ్యం
సీఎంగా ఒమర్​ ప్రమాణం.. అనంతరం ప్రధానికి కలుస్తారన్న అబ్దుల్లా

శ్రీనగర్​: జమ్మూకశ్మీర్​ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తరువాత జేకేఎల్​ ఎఫ్​ నాయకుడు ఫరూక్​ అబ్దుల్లా మాజీ ప్రధానమంత్రి అటల్​ బిహారీ వాజ్​ పాయ్​ ని గుర్తు చేసుకున్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జై శంకర్​ ఎస్​ సీవో సదస్సుకు పాక్​ కు హాజరు కావడంపై స్వాగతిస్తున్నట్లు ఫరూక్​ పేర్కొన్నారు. పాక్​ తో ద్వేషాన్ని విడిచిపెట్టాలన్నారు. గతంలో మాజీ ప్రధాని అటల్​ బిహారీ వాజ్​ పాయ్​ ‘స్నేహితులను మార్చవచ్చు కానీ పొరుగువారిని మార్చలేరన్న’ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ పొరుగుదేశంతో కలిసి పనిచేస్తేనే మరింత వేగంగా అభివృద్ధిని సాధించవచ్చన్నారు. స్నేహంగా ఉంటేనే రెండు దేశాల అభివృద్ధి సాధ్యమని, లేకుంటే ఇరుదేశాలు వెనకబడి పోతాయన్నారు. పాక్​ తన కష్టాలను మరిచి భారత్​ తో చేయి పట్టుకొని నడుస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. సీఎంగా ప్రమాణ స్వీకారం తరువాత ఒమర్​ అబ్దుల్లా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుస్తారని స్పష్టం చేశారు. రాష్ర్ట హోదా, 370, పురోగతిపై చర్చలు కొనసాగిస్తామన్నారు.