శివకాశిలో బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు ఏడుగురు మృతి
12 మంది సజీవ దహనం? కొనసాగుతున్న సహాయక చర్యలు
చెన్నై: తమిళనాడులోని శివకాశి సమీపంలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 20 మంది వరకు మరణించినట్లు తెలుస్తోంది. పేలుడు గురువారం సాయంత్రం సంభవించింది. పూర్తి సమాచారం అందాల్సి ఉంది. అయితే ప్రస్తుతం పోలీసులు సహాయక చర్యలను చేపట్టారు. ఏడుగురు మృతి చెందారని అన్నారు. మరో 12 మంది వరకు సజీవ దహనమయ్యారని అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు. కాగా ఈ ఫ్యాక్టరీకి బాణాసంచా తయారీ అనుమతులు ఉన్నాయా? లేదా? అనే విషయాన్ని పోలీసులు వెల్లడించలేదు. సహాయక చర్యల అనంతరమే పూర్తి వివరాలు వెల్లడించగలమని పోలీసులు తెలిపారు.