భద్రతపై అప్రమత్తత అవసరం

Security vigilance is essential

Nov 22, 2024 - 18:50
 0
భద్రతపై అప్రమత్తత అవసరం

శాంతిభద్రతలపై కేంద్రహోంమంత్రి అమిత్​ షా సమావేశం
జీరో టాలరెన్స్​ విధానాన్ని అనుసరించాలి
పోలీసులు, చట్టం పట్ల నేరస్థుల్లో భయం పుట్టించాలి
సామాన్య ప్రజల్లో భద్రతపై విశ్వాసం పెంచాలి

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: పిల్లలు, మహిళలు, సీనియర్ సిటిజన్లను రక్షించడంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తంగా వ్యవహిచాలని హోం శాఖ మంత్రి అన్నారు. శుక్రవారం ఢిల్లీలోని శాంతిభద్రతల పరిస్థితులపై కేంద్రమంత్రి అమిత్​ షా సీనియర్​ పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. నేరాల పట్ల జీరో టాలరెన్స్​​ విధానాన్ని అనుసరించాలన్నారు. శాంతిభద్రతల విషయంలో ఎలాంటి లోపాలను సహించబోమన్నారు. పోలీసులు ప్రజల విశ్వాసాన్ని, నమ్మకాన్ని చూరగొన్నప్పుడు సంఘంలో అసాంఘిక శక్తుల పనిపట్టడం సులవవుతుందన్నారు. అందుకే సామాన్య ప్రజలతో పోలీసులు బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. భద్రతకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. నేరస్థుల్లో పోలీసులు, చట్టం అంటే భయం పుట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. సామాన్య ప్రజల్లో భద్రతపై విశ్వాసాన్ని పెంచాలని కేంద్రహోంమంత్రి అమిత్​ షా స్పష్టం చేశారు.