సర్వమత సమ్మేళనం భారత్​ రాష్ట్రపతి ముర్మూ

గ్లోబల్ స్పిరిచ్యువాలిటీ మహోత్సవ్‌లో శాంతివనం ప్రారంభం

Mar 15, 2024 - 20:37
 0
సర్వమత సమ్మేళనం భారత్​ రాష్ట్రపతి ముర్మూ

నా తెలంగాణ, హైదరాబాద్​: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ హైదరాబాద్‌లో గ్లోబల్ స్పిరిచ్యువాలిటీ మహోత్సవ్‌ను శుక్రవారం చేగూరులోని శాంతివనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. భారతదేశం వివిధ మతాల సమ్మేళనమన్నారు. శాంతి, సుహృద్భావ వాతావరణంతో ఇక్కడి ప్రజలు జీవనం కొనసాగిస్తున్నారని కొనియాడారు. ఈ మహోత్సవాన్ని ప్రారంభించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ముర్మూ తెలిపారు. ఆధ్యాత్మిక వేత్తల ప్రయత్నాన్ని రాష్ట్రపతి అభినందించారు. ఈ కార్యక్రమంలో 130 దేశాల నుంచి 300మంది ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఇందులో అన్నిమతాలకు చెందిన వారున్నారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ రామచంద్ర మిషన్, ఇతరుల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ ధ్యాన కేంద్రంలో భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రను ప్రదర్శించే ప్రదర్శన, పుస్తకాలు, సంగీతం వంటి కార్యక్రమాలు ప్రదర్శితమయ్యాయి. ఈ కార్యక్రమానికి రామకృష్ణమిషన్, పరమార్థనికేతన్, ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్, ది మాతా అమృతానందమయి మఠం, హైదరాబాద్ ఆర్చ్ బిషప్, ఇతర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ వేసవి కాల విడిది కోసం నగరానికి విచ్చేసిన సందర్భంగా సీఎం రేవంత్​రెడ్డి, గవర్నర్​ తమిళిసైలు ఆమెకు స్వాగతం పలికారు. వీరితోపాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్​ బాబు, సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.