పౌరసత్వం అందజేయడం సంతోషకరం

It is a pleasure to be granted citizenship

Aug 18, 2024 - 17:07
 0
పౌరసత్వం అందజేయడం సంతోషకరం
  • రూ. 1000 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభం
  • సీఏఏపై కాంగ్రెస్​ ఓటుబ్యాంకు రాజకీయాలు
  • ముస్లింలు ఆందోళన చెందొద్దు
  • మిమ్మల్ని రెచ్చగొడుతున్నది వారే
  • కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా

అహ్మాదాబాద్​: పొరుగు దేశాలలోని హిందువులకు, మిగతా వర్గాలకు పౌరసత్వం అందించడంలో ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు వెళుతోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా అన్నారు. 2014 వరకు కాంగ్రెస్ పౌరసత్వ హక్కులు కల్పించలేకపోయిందని విమర్శించారు. ఆదివారం అహ్మాదాబాద్​, గాంధీనగర్​ లో 188మందికి పౌరసత్వం కల్పించారు. రూ. 1000 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మంత్రి అమిత్​ షా మాట్లాడుతూ.. 188మంది పాకిస్థానీ హిందువులకు పౌరసత్వం కల్పించడం సంతోషంగా ఉందన్నారు. తొలిసారిగా పౌరసత్వం అందించిన రాష్ర్టంగా గుజరాత్​ నిలవనుందని తెలిపారు. పౌరసత్వం పొందిన కుటుంబాలను షా అభినందించారు. సీఏఏ ద్వారా ప్రజలకు వారి హక్కులను న్యాయపరంగా కల్పించామన్నారు. కాంగ్రెస్​ ఈ అంశాన్ని ఎప్పుడూ ఓటు బ్యాంకుగానే మలుచుకుందన్నారు. ఈ చట్టం ద్వారా ముస్లిం సమాజం ఆందోళన చెందవద్దన్నారు. కావాలనే విపక్ష పార్టీలు ముస్లిం సమాజాన్ని రెచ్చగొడుతున్నాయన్నారు. తమ ప్రభుత్వం అందరి క్షేమాన్నే కాంక్షిస్తుందని తెలిపారు. 

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని రాబోయే వంద రోజుల్లో 30 లక్షల మొక్కలు నాటాలని అహ్మాదాబాద్​ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మొక్కలు నాటి కర్బన ఉద్గారాలను తగ్గించుకొని మానవ జీవన నాణ్యతను పెంచుకోవాలని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘ఏక్​ పేడ్​ మా కే నామ్​’ ద్వారా బిడ్డల్లాగా మొక్కలను నాటి సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు.