సందేశ్​ ఖాళీ బీజేపీ అభ్యర్థి రేఖాపాత్రకు ముప్పు

ఇంటలిజెన్స్​ నివేదికతో అప్రమత్తం మరో ఐదుగురు నాయకులకు కూడా ఎక్స్​ కేటగిరి కింద భద్రత పెంపు

Apr 30, 2024 - 13:18
 0
సందేశ్​ ఖాళీ బీజేపీ అభ్యర్థి రేఖాపాత్రకు ముప్పు

కోల్​ కతా: సందేశ్​ ఖాళీ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ ఎంపీ అభ్యర్థికి కేంద్రం మంగళవారం నుంచి ఎక్స్​ కేటగిరి భద్రత కల్పించింది. ఇంటలిజెన్స్​ నివేదికల్లో బసిర్‌హాల్‌లో బీజేపీ ఎంపీ అభ్యర్థి రేఖా పాత్రపై దాడులు జరిగే అవకాశం ఉందని గుర్తించింది. నివేదికను కేంద్రానికి వెల్లడించింది. దీంతో కేంద్రం వెంటనే ఆమెకు భద్రత కల్పించాలని నిర్ణయించింది. ఇటీవలి కాలంలో సందేశ్​ ఖాళీలు మహిళలపై జరుగుతున్న పరిణామాలపై రేఖా పాత్ర తీవ్రంగా వ్యతిరేకించింది.

టీఎంసీ షేక్​ షాజహాన్​ పై రాష్​ర్టపతికి కూడా ఫిర్యాదు చేసింది. దీంతో బీజేపీ బాధితురాలిలే తమ అభ్యర్థిగా ఎన్నుకొని మహిళా లోకానికి అండగా నిలిచింది. ఇటీవలే సందేశ్​ ఖాళీలో ఈడీ, ఎస్పీజీ, బాంబు స్క్వాడ్​ దాడుల్లో  భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, బాంబులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేఖా పాత్రకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కమాండోలు రక్షణ కల్పించారు. ఈమెతోపాటు మరో ఐదుగురు బీజేపీ నాయకులకు కూడా ముప్పు పొంచి ఉందని ఇంటలిజెన్స్​ గుర్తించింది. ఆ నాయకులకు కూడా భద్రత పెంచారు.

ఝర్‌గ్రామ్‌ నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న ప్రణత్‌ తుడుతో పాటు బహరంపూర్‌ నుంచి నిర్మల్‌ సాహా, జయనగర్‌ నుంచి అశోక్‌ కందారీ, మధురాపూర్‌ నుంచి అశోక్‌ పుర్‌కైత్‌లకు ‘ఎక్స్‌-కేటగిరీ’ భద్రత కల్పిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రత్వ శాఖ తెలిపింది. కాగా, రాయ్‌గంజ్‌ బీజేపీ అభ్యర్థి కార్తీక్‌ పాల్‌కు ‘వై కేటగిరీ’ భద్రతను కేటాయింది.