కర్ణాటకలో పెట్రోల్, డీజీల్ ధరల పెంపు
వాహనదారులకు కాంగ్రెస్ షాక్ జీవో జారీ చేసిన ప్రభుత్వం
బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం వాహనదారులకు షాక్ ఇచ్చింది. పెట్రోల్, డీజీల్ ధరలను పెంచింది. శనివారం పెరుగుదల జీవోను జారీ చేసింది. ఈ జీవో ప్రకారం పెట్రోల్ పై రూ. 3, డీజిల్ పై రూ.3.05 పెరగనుంది. కాంగ్రెస్ సీఎం సిద్ధిరామయ్య నేతృత్వంలోని మంత్రివర్గం ధరలను పెంచాలని నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు పెట్రోల్‌పై 29.84 శాతం, డీజిల్‌పై 18.44 శాతం అమ్మకపు పన్నును పెంచింది. ఈ నిర్ణయం ప్రభావం గురించి పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్, కర్ణాటకలో తక్షణమే అమల్లోకి వస్తే, పెట్రోల్ ధర సుమారు రూ. 3 పెరుగుతుందని, డీజిల్ ధర రూ. 3.05 పెరుగుతుందని చెప్పారు. ప్రభుత్వం నిర్ణయం వల్ల సరుకు రవాణా వాహన ధరల్లో కూడా పెరుగుదల ఉంటుందని వాహనదారుల యాజమానులు పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈనిర్ణయం వల్ల నిత్యావసరాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.