నకిలీ సారా 47కు పెరిగిన మృతుల సంఖ్య
సీబీఐ విచారణపై కేంద్ర హోంశాఖకు అన్నామలై లేఖ
చెన్నై: తమిళనాడు నకిలీ సారా కేసులో మృతుల సంఖ్య శుక్రవారం వరకు 47కు చేరింది. పలువురి పరిస్థితి ఇంకా విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు వారిని కోర్టులో హాజరుపరచగా వారిని కోర్టు 15 రోజులపాటు జ్యూడీషియల్ కస్టడీకి తరలించింది. కాగా అసెంబ్లీలో నకిలీ మద్యంపై తీవ్ర గందరగోళం చెలరేగింది. స్టాలిన్ ప్రభుత్వాన్ని బీజేపీ ఉక్కిరిబిక్కిరి చేసింది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ చేపట్టాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.