ఉక్రెయిన్​ పై రష్యా దాడి

41మంది మృతి, 180మందికి గాయాలు

Sep 3, 2024 - 18:31
 0
ఉక్రెయిన్​ పై రష్యా దాడి
కీవ్​: ఉక్రెయిన్​ పై రష్యా భారీ దాడికి పాల్పడింది. ఈ దాడిలో 41 మంది మృతి చెందగా, 180 మంది తీవ్రంగా గాయపడ్డారు. సెంట్రల్​ ఉక్రెయిన్​ పోల్టావాలో ఈ దాడులు జరిగినట్లు ఉక్రెయిన్​ అధ్యక్షుడు జెలెన్స్కీ మంగళవారం తెలిపారు. విద్యాసంస్థ సమీపంలో దాడులకు పాల్పడినట్లు వెల్లడించారు. ఆదివారం కూడా ఖర్కివ్​ పై జరిగిన దాడిలో 47 మంది మృతిచెందారు. ఉక్రెయిన్​ పై రష్​యాభారీ దాడులకు పాల్పడుతుండడం పట్ల ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ దాడులపై ప్రతీకార దాడులు చేయాలని రష్యాలోని అంతర్గత ప్రాంతాలపై దాడులు చేస్తామని జెలెన్స్కీ హెచ్చరికలు జారీ చేశారు.