నా తెలంగాణ, రామకృష్ణాపూర్: క్యాతన్ పల్లి పురపాలకం ఐదో వార్డు అమరవాది ఓ పెళ్లి ఇంట్లో మంగళవారం ఉదయం దొంగతనం జరిగింది. ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న రామకృష్ణాపూర్ పోలీసులు ఒక్కరోజులోనే దొంగతనానికి పాల్పడ్డ దొంగను అరెస్ట్ చేసి బంగారం వెండి ఆభరణాలను రికవరీ చేశారు.
సీఐ శశిధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం అమరవాది చెందిన నల్ల రాజలింగు అనే వ్యక్తి ఇంట్లో గత నెల 28న అంగరంగ వైభవంగా పెండ్లి వేడుకలు జరుగగా బంధువులతో ఉన్న తన ఇల్లు చోరీకి గురికాగా
బంగారు, వెండి ఆభరణాలు దొంగతనానికి గురైనట్లు రాజలింగు రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
ఈ మేరకు రంగంలోకి దిగిన పట్టణ పోలీసులు 24గంటల్లోనే దొంగతనం కేసును ఛేదించారు. దొంగతనం చెందిన వ్యక్తి జడి సురేష్ గా గుర్తించారు. చోరీకి గురైన మూడు తులాల బంగారు ఆభరణాలు, రెండు జతల వెండి పట్టీలను రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. పట్టణ ఎస్సై రాజశేఖర్ మాట్లాడుతూ జడి సురేష్ అనే వ్యక్తి పై గతంలో రామకృష్ణాపూర్ పట్టణంలో మొబైల్ దొంగతనం కేసు ఉండగా మంచిర్యాల, చింతల మనేపల్లి పోలీస్ స్టేషన్ లో పలు దొంగతనం కేసులు ఉన్నట్లు వెల్లడించారు. అనంతరం జడి సురేష్ ని రిమాండ్ కు తరలించినట్టు సిఐ తెలిపారు.