ప్రైవేటు స్థానిక ఉద్యోగాలపై హై కోర్టు స్టే

High Court stay on private local jobs

Dec 12, 2024 - 15:56
 0
ప్రైవేటు స్థానిక ఉద్యోగాలపై హై కోర్టు స్టే

ప్రైవేటు సంస్థల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు
ఝార్ఖండ్​ అసెంబ్లీ నిర్ణయంపై హైకోర్టు స్టే
ప్రైవేటు సంస్థలను ఆదేశించలేం
ఉపాధి సమానత్వానికి హామీ
పంజాబ్​, హరియాణాలో ఇప్పటికే పిటిషన్​ తిరస్కరణ
చిన్న పరిశ్రమ వర్గాలకు ఊరట

రాంచీ: ప్రైవేటు ఉద్యోగాల్లో 75 శాతం రిజర్వేషన్​ కల్పించే చట్టాన్ని ఝార్ఖండ్​ లో అమలు చేసేది లేదని ఆ రాష్ట్ర హైకోర్టు తేల్చి చెప్పింది. ఝార్ఖండ్​ అసెంబ్లీ ఆమోదించిన రాష్ట్ర ఉపాధి చట్టం 2021 అమలుపై  రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. చిన్న పరిశ్రమల సంఘం తరఫున దాఖలైన పిటిషన్​ పై గురువారం ఝార్ఖండ్​ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం జస్టిస్​ ఎంఎస్​ రామచంద్రరావు, జస్టిస్​ దీపక్​ రోషన్​ లతో కూడిన బృందం విచారణ చేపట్టింది. 75 శాతం రిజర్వేషన్​ ఆదేశాలను నిలిపివేసింది. హైకోర్టు తీర్పుపై పిటిషనర్​ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. ఈ చట్టం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా ఉందని కోర్టు పేర్కొందని చెప్పారు. రాజ్యాంగం ఉపాధిలో సమనత్వానికి హామీ ఇస్తుందన్నారు. ఒక నిర్దిష్ఠ వర్గానికి ఉపాధి కల్పించే విషయంలో ప్రైవేటు  సంస్థలకు ఆదేశాలు ఇవ్వలేమని న్యాయమూర్తులు స్పష్టం చేశారని పేర్కొన్నారు. ఇలాంటి అంశాలపై ఇప్పటికే పంజాబ్​, హరియాణా లాంటి న్యాయస్థానాలు తీసుకున్న నిర్ణయాలను గుర్తు చేశారు. అక్కడ కూడా పిటిషన్​ లను రద్దు చేశారని చెప్పారు. పిటిషన్​ పై పూర్తి సమాధానం ఇవ్వాలని రాష్​ర్ట ప్రభుత్వాన్ని హై కోర్టు ఆదేశించింది. పిటిషన్​ పై తదుపరి విచారణ 2025 మార్చి 20న జరపాలని నిర్ణయించింది. 
ఝార్ఖండ్​ అసెంబ్లీ ఆమోదించిన నిర్ణయం ప్రకారం ప్రైవేటు సంస్థలో నెలలవారీ వేతనం ప్రతీ కార్మికునికి రూ. 40 వేలు ఉండాలని, 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే కేటాయించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం చిన్న పరిశ్రమ వర్గాలకు ఆశనిపాతంలా మారడంతో సంఘం హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేసింది.