పద్మ అవార్డులు–2025 దరఖాస్తులు ప్రారంభం

Padma Awards–2025 Applications open

Sep 3, 2024 - 18:12
 0
పద్మ అవార్డులు–2025 దరఖాస్తులు ప్రారంభం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ప్రతిష్ఠాత్మకమైన పద్మ అవార్డులు–2025 కోసం కేంద్రం దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించినట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం 2025 నాడు ఈ అవార్డులను ప్రకటించనున్నారు. ఈ అవార్డులను కళ, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, సైన్స్​, ఇంజనీరింగ్​, ప్రజా వ్యవహారాలు, పౌర సేవ, వాణిజ్యం, పరిశ్రమలు సహా విభిన్న రంగాలలో విశేష కృషి చేసిన వారికి ఇస్తారు. మహిళలు, బడుగు, బలహీన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, వికలాంగులు, నిస్వార్థ సేవలో నిమగ్నమైన వారు ఇలా వీరు వారు అనిగాకుండా సమాజ సేవలో పాలుపంచుకొని ముందున్న వారికి కూడా ఈ అవార్డులను ప్రకటిస్తారు.