రూ. 5 వేలకోట్ల సైబర్​ మోసం

ఎట్టకేలకు నిందితుడి అరెస్ట్​ వివరాలు వెల్లడించిన ఈడీ 

Apr 10, 2024 - 15:03
 0
రూ. 5 వేలకోట్ల సైబర్​ మోసం

న్యూఢిల్లీ: న్యూఢిల్లీ విమానాశ్రయంలో రూ. 5వేల కోట్ల సైబర్​ మోసానికి పాల్పడిన నిందితుడిని ఈడీ అరెస్టు చేసింది. ఇతని కోసం ఎన్నో రోజులుగా ఉచ్చు బిగించగా ఎట్టకేలకు ఏప్రిల్​ 3న అరెస్టు చేసినట్లు బుధవారం వెల్లడించింది. నిందితుడు పునీత్​ కుమార్​ ఆన్​ లైన్​ గేమింగ్​, మనీలాండరింగ్​ ద్వారా మోసాలకు పాల్పడ్డాడని ఈడీ తెలిపింది. అంతకుముందు ఇతను స్థాపించిన కాల్​ సెంటర్​ లో 12 మందిని కూడా పోలీసులు అరెస్టు చేసి విచారించారు. వీరి ద్వారానే నిందితుడి రాక సమాచారం అందినట్లు వెల్లడించారు. ఇతని కోసం గాలింపు చేపట్టగా భారత్​ నుంచి నేపాల్​ కు పారిపోయాడని తెలిపారు. వివిధ పథకాల పేరుతో సామాన్యులను మభ్యపెడుతూ డబ్బును పోగేసుకున్నాడని గుర్తించినట్లు తెలిపారు. 

ఇతని గురించి విచారిస్తే భారీ స్కామ్​ గుట్టురట్టయినట్లు వివరించారు. యూఏఈలో సర్వర్​ లను ఉపయోగిస్తూ సిండికేట్​ స్థాపించినట్లు గుర్తించామని పేర్కొంది. ఆన్​ లైన్​ గేమింగ్​ ద్వారా రూ. 4978 కోట్లు ఆర్జించినట్లు పేర్కొంది. ఇప్పటికే ఈ కేసులో అనేకమందిని అరెస్టు చేసినట్లు వివరించింది. ప్రధాన నిందితుడు మాత్రం ఇప్పుడు చిక్కాడని వెల్లడించింది.

ప్రజలు లాభాలను ఆశిస్తూ ఇటువంటి మోసగాళ్ల బారిన పడవద్దని పోలీసులు సూచించారు. కొల్లగొట్టిన డబ్బునంతా దుబాయ్​, సింగపూర్​ లాంటి దేశాలకు పంపించినట్లు ఈడీ తెలిపింది. 
కాగా మహారాజా గేమింగ్​ స్కామ్​ లో కూడా పలువురిని ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ స్కామ్​ లో బడా సినీ ప్రముఖులకే వాటాలు దక్కడం మరో విశేషం.