ఉచితాలపై ధీమాతోనే పోటీలోకి
పీడీపీ ఓట్లకు కాంగ్రెస్, ఎన్సీపీ విలీనం గండి
వార్ వన్ సైడ్ గా సింగిల్ గానే బరిలోకి బీజేపీ
మోదీ నేతృత్వంలో అభివృద్ధికే జై కొడుతున్న ప్రజలు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు గెలుపునకు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం పీడీపీ (జమ్మూకశ్మీర్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ) మహాబూబా ముఫ్తీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఎన్నికల్లో ఎన్సీపీ, పీడీపీల ఓట్లలో భారీ చీలికలు ఏర్పడనున్న నేపథ్యంలో పీడీపీ అమలు కాని హామీలను తమ మేనిఫెస్టోలో పెట్టడం గమనార్హం. మరోవైపు కాంగ్రెస్, ఎన్సీపీల విలీనంతో పీడీపీకి భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉండడంతో ఉచితాల మేనిఫెస్టోపైనే ఆశలు పెట్టుకుంది.
ఇంకోవైపు ఈ మూడు పార్టీలకు ధీటుగా బీజేపీ అభివృద్ధి ప్రచారంలో దూసుకుపోతోంది. వార్ వన్ సైడ్ గా రంగంలోకి దిగుతోంది. మోదీ నేతృత్వంలోని అభివృద్ధిపైనే జమ్మూకశ్మీర్ ప్రజలు మొగ్గు చూపుతుండడం విశేషం.
మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు..
ఏడాదికి 12 గ్యాస్ సిలీండర్లు
ప్రతీ ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్
బకాయి విద్యుత్ బిల్లులకు పరిష్కారం
ఉచిత మంచినీరు
బీపీఎల్ కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 కిలోల రేషన్ ఉచితం
పీడీఎస్ పరిధిలోకి చక్కెర, కిరోసిన్ తీసుకురావడం
మహిళల ఆస్తి కొనుగోలుపై డ్యూటీ రద్దు
అన్ని బీపీఎల్ పరిధిలోని కుటుంబాలకు ఆస్తి పన్ను రద్దు
ఇళ్ల నిర్మాణానికి సబ్సిడీపై కలప అందజేత
వృద్ధాప్, వితంతు, వికలాంగుల పెన్షన్ వంటి సామాజిక భద్రతా పథకాల కింద నిధులను రూ. 1000 నుంచి రూ. 2000కు పెంపు.
బ్యాంక్ ఋణాల కోసం ఓటీఎస్ పథకంపై సమీక్ష.