ప్రజాక్షేత్రంలో మోదీ@23

Modi@23 in the public sphere

Oct 7, 2024 - 17:58
 0
ప్రజాక్షేత్రంలో మోదీ@23
నిబద్ధత, ఠీవీ, నిగర్వీగా ముద్ర
కష్టాల కడలి నుంచి దేశ అత్యున్నతస్థాయికి
తల్లికష్టాలపై పలుమార్లు కన్నీరు
మెట్టు మెట్టు ఎదుగుతూ..
మూడుసార్లు సీఎం, మూడుసార్లు పీఎంగా ఆదరణ
ప్రపంచ రాజకీయ క్షేత్రంలో మోదీని మించినవారేరి!
ఇప్పటికీ సాదాసీదా జీవనశైలే
నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: ప్రజాక్షేత్రంలో ప్రధాని నరేంద్ర మోదీ అడుగిడి 23యేళ్లు పూర్తయ్యాయి. అంతకుముందు కూడా ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పనిచేసినా గుజరాత్​ ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్​, దేశ ప్రధానిగా హ్యాట్రిక్​ తో మోదీ ప్రపంచవ్యాప్త ఆదరణ పొందారు. ఈ సమయంలో ప్రధాని మోదీ ఎన్నో ఎత్తుపళ్లాలను అధిగమించి దేశ వృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేశారు. ఒక్కోసారి రోజులో 18గంటలకు పైగా పనిచేసిన దాఖలాలున్నాయి. ఆనాటి నుంచి నేటి వరకూ ఆయన పనితీరులో అదే నిబద్ధత, ఠీవీ కొనసాగుతున్నాయి. ఏ మాత్రం గర్వం లేని నిగర్వీగా ముద్రపడ్డ వారిలో మోదీ ప్రథమ వరుసలో ఉన్నారు.
 
గుజరాత్​ లోని చిన్నపట్టణంలో 1950న అట్టడుగు, వెనుకబడిన తరగతికి చెందిన ఓ నిరుపేద కుటుంబంలో జన్మించాడు. రూపాయి సంపాదించేందుకు కూడా పడ్డ కష్​టం ఆయనకు ఆర్థిక క్రమశిక్షణను నేర్పింది. నోట్లోకి వెళ్లేముద్ద కూడా ఆ రూపాయితోనే వస్తుందన్న నిజాన్ని గ్రహించిన ఆయన అనేక కష్టనష్టాలను భరించి గుజరాత్​ విశ్వవిద్యాలయం నుంచి పోలిటికల్​ సైన్స్​ లో ఎంఏ పూర్తి చేశారు. ఈ సందర్భంలో ఆర్​ఎస్​ఎస్​ తో కలిసి పనిచేశారు. అప్పుడప్పుడు పలు వేదికలపై తన తల్లిపడ్డ కష్టాలను వివరిస్తూ కన్నీటి పర్యంతమైన సందర్భాలు కూడా దేశ ప్రజలు అనేకం చూసిన దాఖలాలున్నాయి. 
 
అంతగా కష్టనష్టాలను అనుభవించిన ఆయన క్రమేణా మంచిపనులతో ప్రజల నాలుకల్లో నానాడు. వారి సమస్యల పరిష్​కారమే తన శ్రేయస్సు అని గుర్తించాడు. అలా ప్రజా నాయకుడుగా మెట్టుమెట్టు ఎదిగాడు. దీంతోనే తృప్తి పడక మరింత ముందుకు వెళ్లాడు. ఆయనలోని కృషి, పట్టుదలను చూసిన గుజరాత్​ ప్రజానీకం ఆయన్ను హ్యాట్రిక్​ ముఖ్యమంత్రిగా ఎన్నుకుంది. ఆ తరువాత జీవితంలో వెనుదిరిగి చూసుకోలేదు. అదే ఠీవీ, ఏ మాత్రం తొణికిసలేని వాక్చాతుర్యం, మాట ఇస్తే మడమతిప్పని తీరు కొనసాగిస్తూ దేశవ్యాప్త పర్యటనలతో పీఎంగా ఎంపికయ్యారు. ఇక్కడా దేశ ప్రజలు ఆయన్న ముచ్చటగా మూడుసార్లు ఆశీర్వదించారు. రాజకీయ రణక్షేత్రంలో ఈ 23యేళ్లలో మోదీ ఏనాడు వెనుదిరిగి చూడని ధీరుడిగా నిలిచాడు.
 
ప్రస్తుతం ప్రపంచంలో ప్రప్రథమ స్థానంలో ఇష్టపడుతున్న నాయకుల్లో మోదీ నిలిచాడు. ప్రపంచాన్నంతా వైశ్విక కుటుంబం అని, ఆపన్నహస్తం అందిస్తూ ప్రపంచవ్యాప్తంగా మన్ననలను పొందుతున్నాడు. ఇంత ఉన్నతస్థాయి పదవిలో ఉన్నా ఆయన రోజువారీ జీవితం ఓ సామాన్యుడి జీవితాన్ని పోలి ఉంటుంది. క్రమం తప్పకుండా ఉదయం యోగా సాధన, ఉదయం అల్పహారం, మధ్యాహ్నం, రాత్రి శాఖాహారాన్నే ఆయన తీసుకుంటారు. 
 
మోదీ ప్రారంభించిన పలు కార్యక్రమాలు..
బేటీ బచావో, బేటీ పడావోతో – ఆడపిల్లల సంరక్షణ, జన్​ ధన్​ తో నిరుపేదలకు ఆర్థిక స్వావలంభన, సంసద్​ ఆదర్శ్​ గ్రామ యోజనతో సమగ్ర అభివృద్ధి నమూనా, మేక్​ ఇన్​ ఇండియా, ఈజ్​ ఆఫ్​ డూయింగ్​ లతో వ్యవస్థలకు, వ్యక్తులకు, వ్యాపారాలకు, పరిశ్రమలకు ఊతం, నమామి గంగేతో ఆధ్యాత్మికతకు ప్రాముఖ్యత, ఏడు దశాబ్ధాలుగా అంధకారంలో ఉన్న 18వేల గ్రామాలకు పైగా విద్యుత్​ అందజేత, రైతుల సాధికారత కోసం పీఎం కిసాన్​ యోజన, అన్న యోజన, ఉత్పాదకతలో పెంపు కోసం పర్​ డ్రాప్​ మోర్​ క్రాప్​, సేంద్రీయ వ్యవసాయానికి, చిరుధాన్యాల పంటల సాగుకు ప్రోత్సాహకాలు, రైతు సంఘాలను ప్రోత్సహించేందుకు పరం పరగత్​ కృషి యోజన, అవినీతి పాలన అంతానికి డిజిటలీకరణ, పీఎం విద్యాలక్ష్మి, సబ్‌కాసాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్ నినాదంతో స్ఫూర్తి, ఆయుష్మాన్​ భారత్​ కింద 50 కోట్లమందికి ఉచిత వైద్యం, పేదలకు ఉజ్జ్వల గ్యాస్​ యోజన ద్వారా 10 కోట్ల మందికి సిలీండర్ల అందజేత గ్రామీణ మహిళలకు పొగ నుంచి విముక్తి. 4.2 కోట్లమందికి పీఎం ఆవాస్​ యోజన కింద గృహాలు మంజూరు, కిసాన్​ సమ్మాన్​ తో రైతులందరికీ క్రమం తప్పకుండా ఆర్థిక సహాయం అందజేత, పీఎం కిసాన్​ ద్వారా నిధుల విడుదల, సాయిల్​ హెల్త్​ కార్డులు, నూతన జలశక్తి మంత్రిత్వ శాఖ ఏర్పాటు, స్వచ్ఛ భారత్​ మిషన్​ తో పరిశుభ్రత పెంపు, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్వచ్ఛ శౌచాలయ్​ పేరుతో నిరుపేదలకు ఆర్థిక సహాయం,  విమానాయాన రంగం పటిష్టతకు ఉడాన్​, రోడ్ల అభివృద్ధికి పరివర్తన్​, రైల్వే లైన్​ లు కోచ్​ లు, నూతన రైళ్లు పెంపు ద్వారా దేశంలోని ప్రతీ గ్రామానికి కనెక్టివిటీ, నూతన పార్లమెంట్​ నిర్మాణం, సెంగోల్​ స్థాపన, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 186 మీటర్లుగా నమోదైన సర్దార్​ పటేల్​ విగ్రహ నిర్మాణం, ఏక్​ భారత్​ శ్రేష్ఠ భారత్​ తో దేశ ప్రజల్లో స్ఫూర్తి, నమ్మకం, విశ్వాసాల పెంపు, అగ్నివీర్​, వన్​ ర్యాంక్​ వన్​ పెన్షన్​, మహిళాభివృద్ధి, పర్యావరణం, స్టార్టప్​ లు, జీ–20  నిర్వహణ, ఖేలో ఇండియాతో యువతలో ఆత్మవిశ్వాసం పెంపు, చంద్రయాన్​, సూర్యయాన్​ లతో అంతరిక్ష రంగం బలోపేతం, ఉక్రెయిన్​, ఇజ్రాయెల్​, రష్​యా, టర్కీ, బంగ్లాదేశ్​ లలో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా వెనక్కు తీసుకురావడం, ఖతర్​ లో ఉరిశిక్ష పడ్డ భారతీయులను సైతం శిక్ష రద్దు చేయించి సురక్షితంగా భారత్​ చేర్చడం ఇలా చెప్పుకుంటూ పోతే అణువణువులోనూ మోదీ పాలన మార్క్​ కనిపిస్తుంది. నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఏ మాత్రం వెనుకంజ వేయకుండా ప్రతీదాంట్లోనే అదే మార్కును చూపిస్తూ దేశాన్ని వెలుగులు వైపు తీసుకువెళుతున్న ప్రధాని మోదీ నిర్ణయాలకు హ్యాట్సాఫ్​.
 
విదేశాల్లో మోదీ ఖ్యాతి..అవార్డులు..
సౌదీ అరేబియా – కింగ్ అబ్దుల్ అజీజ్ సాష్‌, రష్యా – ది ఆర్డర్ ఆఫ్ ది హోలీ అపోస్టిల్ ఆండ్రూ ది ఫస్ట్, పాలస్తీనా – గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీనా, ఆఫ్ఘనిస్తాన్ – అమీర్ అమానుల్లా ఖాన్ అవార్డు, యుఎఇ – ఆర్డర్ ఆఫ్ జాయెద్, మాల్దీవులు – రూల్ ఆఫ్ నిషాన్ ఇజ్జుద్దీన్, బహ్రెయిన్ –కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ది రినైసెన్స్, భూటాన్ – ఆర్డర్ ఆఫ్ ది డ్రక్ గ్యాల్పో, పపువా న్యూ గినియా – గ్రాండ్ కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ లోగోహు, ఫిజీ – కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ, ఈజిప్ట్ – ఆర్డర్ ఆఫ్ నైలు, ఫ్రాన్స్ – గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్, గ్రీస్ –ది గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ హానర్, 2018లో సియోల్ శాంతి బహుమతి, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ – గ్లోబల్ గోల్‌కీపర్ అవార్డు, కేంబ్రిడ్జ్ ఎనర్జీ రీసెర్చ్ అసోసియేట్స్ – గ్లోబల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్‌మెంట్ లీడర్‌షిప్ లాంటి ఇంకా ఎన్న అవార్డులను సొంతం చేసుకున్న నాయకుడు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే అది ప్రధాని నరేంద్ర మోదీ అని చెప్పొచ్చు.