రూ. 30 కోట్ల డ్రగ్స్ స్వాధీనం, ముగ్గురు విదేశీయుల అరెస్ట్
Rs. 30 crore drugs seized, three foreigners arrested
ముంబాయి: రూ. 30 కోట్ల విలువైన డ్రగ్స్ తో ముగ్గురు విదేశీ స్మగ్లర్లను ముంబాయి క్రైయిమ్ బ్రాంచ్ అధికారులు అరెస్టు చేశారు. నవీ ముంబాయిలో వీరు అక్రమంగా నివసిస్తున్నట్లు గుర్తించారు. వీరికి పలు నేరాలతో కూడా సంబంధాలున్నాయని గుర్తించారు. ఇప్పటివరకూ ముంబాయిలో డ్రగ్స్ కు సంబంధించి కేసులలో 13 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పాస్ పోర్ట్ లు, వీసాల గడువు ముగిసిన 73 మందిని వెంటనే దేశం విడిచి వెళ్లాలని నోటీసులు జారీ చేశారు. క్రైయిమ్ బ్రాంచ్ చేపట్టిన ఈ ఆపరేషన్ లో 2.045 కిలోల కొకైన్ (విలువ రూ. 10.22 కోట్లు), 0.663 కిలోల ఎండీ పౌడర్ (విలువ రూ. 1.48 కోట్లు), 58 గ్రాముల మిథిలిన్ (విలువ రూ. 11.6 లక్షలు), 23 గ్రాముల హాషిష్ (విలువ రూ. 3.45 లక్షలు), 31 గ్రాముల గంజాయి (విలువ రూ. 6 వేలు) ఉన్నట్లు వివరించారు.