పీఎంజేజేబీవైలో 21 కోట్ల మంది లబ్ధిదారుల చేరిక

21 crore beneficiaries included in PMJJBY

Dec 14, 2024 - 16:36
 0
పీఎంజేజేబీవైలో 21 కోట్ల మంది లబ్ధిదారుల చేరిక

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: పీఎంజేజేబీవై (ప్రధానమంత్రి జీవన్​ జ్యోతి బీమా యోజన) కింద 21 కోట్ల మంది లబ్ధిదారులు రూ. 2 లక్షల జీవిత బీమా కవరేజీలో చేరారని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. శనివారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. అనిశ్చితి సమయంలో కుటుంబాలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని, ఆర్థిక భద్రత లభిస్తుంది. ఈ పథకం ద్వారా 2024 అక్టోబర్​ 20 నాటికి రూ. 17,211.50 కోట్ల బీమా కవరేజీని అందించారు. 

ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్​ బీవై) 48 కోట్ల మంది వ్యక్తులు రూ. 2 లక్షల ప్రమాద బీమా కవరేజీ కోసం నమోదు చేసుకున్నారు. ఈ పథకం కింద 1,47,641 క్లైయిమ్​ లను పరిష్కరించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతేగాక ప్రధానమంత్రి జన్​ ధన్​ యోజన కింద 2024 ఆగస్ట్​ 14 వరకు 53.13 కోట్ల ఖాతాదారులు ఉండగా, వీరిలో 29.56 కోట్ల మంది మహిళలు, ఉన్నారని వీరి డిపాజిట్ల మొత్తం రూ. 2,31,236 కోట్లు అని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది గతంతో పోలిస్తే 3.6 శాతం పెరుగుదులను సూచించినట్లు తెలిపింది.