రూ. 13.87 కోట్లతో డాప్లర్​ రాడార్​ల ఏర్పాటు

వాతావరణ ఖచ్చిత సమాచారం సాధ్యం ప్రాణ, ఆస్తి నష్టాల తగ్గింపునకు చర్యలు పార్లమెంట్​ లో కేంద్రమంత్రి జితేంద్రసింగ్​ 

Aug 2, 2024 - 18:20
 0
రూ. 13.87 కోట్లతో  డాప్లర్​ రాడార్​ల ఏర్పాటు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఖచ్చితమైన వాతావరణాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వ డాప్లర్​ వాతావరణ రాడార్​ లను ఏర్పాటు చేసేందుకు రూ 13.87 కోట్లు వెచ్చించిందని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్​ తెలిపారు. శుక్రవారం పార్లమెంట్​ లో లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.
 
దీని ద్వారా వాతావరణంలోని అననుకూల పరిస్థితులను తెలుసుకొని ముందే జాగ్రత్త పడవచ్చన్నారు. 
హిమాచల్​ ప్రదేశ్​ లోని మూడు ప్రాంతాల్లో ఈ డాప్లర్​ వెదర్​ రాడర్లు పనిచేస్తున్నయని తెలిపారు. 
వీటి ద్వారా వాతావరణానికి సంబంధించి ఖచ్చితమైన డేటా అందుతోందన్నారు. 
 
హిమాచల్​ లోని గిరిజన అత్యంత ఎత్తైన ప్రాంతం లాహౌల్-స్పితిలో ఈ రకమైన డాప్లర్​ ను ఏర్పాటు చేశామన్నారు. దీని ద్వారా ప్రకృతి వైపరీత్యాల ఖచ్చితత్వంతో కూడుకున్న సమాచారం అందుతోందన్నారు. వీటి వినియోగం వల్ల ఆస్తి, ప్రాణ నష్టాలను నివారించడంలో ప్రభుత్వం, అధికారులు, ప్రజలు అప్రమత్తమవుతారని తెలిపారు.