డిజిటల్​ విప్లవం

Digital revolution

Aug 2, 2024 - 18:02
 0
డిజిటల్​ విప్లవం
95.15 శాతం గ్రామాల్లో ఇంటర్నెట్​ కనెక్టివిటీ
954.40 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌లు
మొబైల్​ కనెక్టివిటీ కలిగి ఉన్న గ్రామాలు 6,12,952
9వేల కుగ్రామాల్లో 4జీ కనెక్టివిటీకి రూ. 11వేల కోట్లు అందజేత
పీఎం గతిశక్తి సంచార్​ పోర్టల్​ ద్వారా టవర్ల ఏర్పాటు సులభతరం

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: దేశంలోని అన్ని ప్రాంతాల్లో డిజిటల్​ సేవలను అందించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ తీసుకుంటున్న చొరవ సత్ఫలితాలను సాధిస్తోంది. దేశంలోని 95.15 శాతం గ్రామాల్లో ఇంటర్నెట్​ సౌకర్యం అందుబాటులో ఉంది.
 
నగరాలనే కాకుండా గ్రామాల్లోనూ డిజిటల్​ సేవలను విస్తృతం చేయాలని మోదీ ప్రభుత్వం సంకల్పించింది. ఇంటర్నెట్​ అందుతున్న గ్రామాల్లో ప్రస్తుతానికి 3జీ, 4జీ కనెక్టివిటీని అందజేస్తోంది. 2014లో 251.59 మిలియన్లుగా ఇంటర్నెట్​ సబ్‌స్క్రైబర్‌లు ఉండగా, 2024 వరకు ఆ సంఖ్య 954.40 మిలియన్ల (14.26శాతం)కు పెరిగింది.
 
2024 ఏప్రిల్​ నాటికి 6,44,131 గ్రామాల్లో మొబైల్​ కనెక్టివిటీని  కలిగిన ఉన్న గ్రామాలు 6,12,952గా ఉన్నాయి. గత పదేళ్లుగా మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో భారీగా ఇంటర్నెట్​ వినియోగించే వారి సంఖ్య పెరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్రం భారత్​ నెట్​ ప్రాజెక్టు కింద అన్ని గ్రామ పంచాయలలో ఆప్టికల్​ ఫైబర్​ కేబుల్​ కనెక్టివిటీతో అనుసంధానించాలని నిర్ణయించింది. ఇప్పటికే 2.22 లక్షల గ్రామ పంచాయతీల్లో 2.13 లక్షల గ్రామాలు ఇంటర్నెట్​ సేవలందించేందుకు సిద్ధమయ్యాయి. 
 
దేశంలో 35,680 చిన్న గ్రామాలున్నాయి. ఇక్కడ ఇప్పటికీ 4 జీ కనెక్టివిటీ లేదు. ఈ ప్రాంతాలన్నీ సరిహద్దులు, కొండా కోనలు, అటవీ వంటి ప్రాంతాల్లో ఈ గ్రామాలున్నాయి. వీటిలో 9వేల గ్రామాలకు 4జీ కనెక్టివిటీని అందించేందుకు కేంద్రం రూ. 11వేల కోట్లను అందించింది. 

 
వీటితోపాటు సరిహద్దుల్లో మొబైల్​ టవర్ల సంఖ్యను పెంచడం, టవర్ల ఏర్పాటు కోసం లైసెన్సింగ్​ విధానాన్ని సరళీకృతం చేయడం లాంటి చర్యలను చేపట్టింది. అనుమతులను వేగంగా ఇచ్చేందుకు ‘పీఎం గతిశక్తి సంచార్​ పోర్టల్​’ని ప్రారంభించింది. సరిహద్దుల్లో మారుమూల గ్రామీణ ప్రాంతాలలో టవర్ల ఏర్పాటుకు ఈ పోర్టల్​ ద్వారా సులభంగా అనుమతి పొందేలా చర్యలు చేపట్టింది.