ఈఓఎస్–8 ప్రయోగానికి ఇస్రో సిద్ధం
ISRO ready for EOS-8 launch
శ్రీహరికోట: దేశాన్ని, ప్రపంచాన్ని విపత్తుల నుంచి అప్రమత్తం చేసేందుకు ఇస్రో నూతన భూమి పరిశోధన శాటిలైట్ (ఎర్త్ అబ్జర్వేషన్) శాటిలైట్ ఈఓఎస్–8ను ప్రయోగించేందుకు సిద్ధమైంది. ఈ శాటిలైట్ ను ఎస్ఎస్ ఎల్ వీ–డీ3ద్వారా ప్రయోగించనున్నట్లు ఇస్రో అధికారులు మంగళవారం వెల్లడించారు. లాంచ్ తేదీని నిర్ణయించలేదన్నారు.
175.5 కేజీల బరువు ఈ శాటిలైట్ ద్వారా పర్యావరణం, విపత్తులు, సాంకేతికతల వినియోగానికి తోడ్పాటునందిస్తుందని తెలిపారు. ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్‌ఫ్రారెడ్ పేలోడ్ (ఈవోఐఆర్), గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ రిఫ్లెక్టోమెట్రీ పేలోడ్ (జీఎన్ ఎస్ఎస్–ఆర్), ఎస్ ఐసీ సీవీ డోసిమీటర్ లు ఉంటాయని స్పష్టం చేశారు. ఈవోఐఆర్ పగలు, రాత్రి సమయంలో ఛాయాచిత్రాలను తీసుకుంటుంది. సముద్ర ఉపరితలంపై గాలిని జీఎన్ ఎస్ఎస్–ఆర్ విశ్లేషిస్తుంది. నేలలోని తేమ, వరదలు వంటి వాటిపై సమాచారం అందించనుంది. ఎస్ఐసీ సీవీ ద్వారా అతినీలలోహిత కిరణాలను డోసిమీటర్ తో పరీక్షించేందుకు ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు.