మౌలిక సదుపాయాలకు పెద్దపీట

కమ్యూనిటీ హాల్​ ప్రారంభంలో కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి

Aug 6, 2024 - 15:03
 0
మౌలిక సదుపాయాలకు పెద్దపీట


నా తెలంగాణ, హైదరాబాద్: తెలంగాణలో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని తెలంగాణ రాష్​ర్ట బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్​ రెడ్డి అన్నారు. మంగళవారం సికింద్రాబాద్​ లోని బౌద్ధనగర్​ డివిజన్​ పార్శిగుట్ట అశోక్​ నగర్​ లో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్​ ను కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి ప్రారంభించారు. కమ్యూనిటీ హాల్​ నిర్మాణం వల్ల స్థానికులు నిర్వహించుకునే శుభాకార్యాలకు ఆర్థిక భారం పడదన్నారు. విశాలమైన స్థలంలో నిర్మించిన ఈ కమ్యూనిటీ హాల్​ ను స్థానికులు సద్వినియోగం చేసుకోవాలని కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి తెలిపారు. 

కమ్యూనిటీ హాల్​ నిర్మాణం, ప్రారంభోత్సవం పట్ల స్థానికులు కేంద్రమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.