రాత్రి 11 గంటల వరకు దుకాణాలు మూసివేయాలి
వ్యాపారులకు పోలీసుల ఆదేశాలు
నా తెలంగాణ, హైదరాబాద్: ప్రతీరోజూ రాత్రి 10.30 నుంచి 11 గంటల లోపు వ్యాపారాలు మూసివేయాలని హైదరాబాద్ పోలీసులు వాణిజ్య సంస్థలు, వ్యాపారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల జరుగుతున్న వరుస హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఆదివారం పలు పోలీస్ స్టేషన్లలో వ్యాపారులతో సమావేశాలు, సమీక్షలు నిర్వహించారు. అలాగే ప్రజలకు కొన్ని సూచనలు జారీ చేశారు. రాత్రి పూట రోడ్లపై అపరిచిత వ్య్తులకు లిఫ్ట్ లు ఇవ్వొద్దన్నారు. అర్థరాత్రి పూట యువకులు రోడ్లపై తిరగొద్దని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలు, అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. నగరంలో శాంతిభద్రతలకు భంగం కలిగించవద్దన్నారు. అసాంఘిక శక్తులపై తమకు సమాచారం అందించాలని పోలీసులు వ్యాపారులకు తెలిపారు.