నీట్ కు 750మంది గైర్హాజర్! బిహార్ లో సీబీఐపై దాడి
750 absentees for NEET! Attack on CBI in Bihar
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: నీట్ పరీక్షల్లో 750 మంది గైర్హాజర్ అయ్యారు. ఆదివారం 1563 మంది విద్యార్థుల కోసం సుప్రీం ఆదేశాల మేరకు ప్రత్యేకంగా నీట్ పరీక్షను మరోమారు నిర్వహించారు. ఏడు ప్రాంతాల్లో వీరి కోసం ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షకు 813 మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. చండీగఢ్ లో ఉన్న సెంటర్ ను కేవలం ఇద్దరు అభ్యర్థుల కోసమే ఏర్పాటు చేయగా వారు గైర్హాజర్ కావడం విశేషం.
మరోవైపు నీట్ పై సీబీఐ ఎఫ్ ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఐపీసీ సెక్షన్లు 120–బీ, 420 సెక్షన్ల కింద ఎఫ్ ఐఆర్ నమోదు చేసింది. రెండు ప్రత్యేక బృందాలు పాట్నా, గోద్రాకు వెళ్లాయి.
సీబీఐపై దాడి..
మరోవైపు బిహార్ వెళ్లిన సీబీఐ బృందానికి చుక్కెదురైంది. గ్రామస్థులు సీబీఐ అధికారులపై దాడులకు పాల్పడ్డారు. స్థానిక పోలీసులు రంగ ప్రవేశం చేసి అతికష్టం మీద వారిని అక్కడి నుంచి తరలించారు.