రోడ్డు ప్రమాదాలు.. బీమా క్లైయిమ్ ల కోసం ఎదురుచూపులు
Road accidents.. Waiting for insurance claims
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: దేశవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో అందించాల్సిన పరిహారం బీమా క్లైమ్ లు పెండింగ్ నిధుల రాక కోసం బాధితులకు ఎదురు చూపులు తప్పడం లేదు. ఆర్టీఐ యాక్ట్ ప్రకారం అందిన వివరాల ప్రకారం 10 లక్షలకు పైగా బీమా క్లైయిమ్ లు పెండింగ్ లో ఉన్నాయి. ఈ కేసులకు సంబంధించి రూ. 880, 455 కోట్ల రూపాయల పరిహారం బాధితులకు దక్కాల్సి ఉంది. దేశవ్యాప్తంగా 10, 46, 163 ప్రమాదాల కేసులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. 2018–19 నుంచి 2022–23 వరకు ఆర్టీసీ నుంచి సమాచార సేకరణలో ఈ విషయాలు వెలుగులోకొచ్చాయి. వివరాలను ‘ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా’ అందించింది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న మోటారు వాహన ప్రమాద క్లెయిమ్‌ల వివరాలను రాష్ట్ర, జిల్లాల వారీగా అందించింది.
అయితే పెండింగ్ లో ఉన్న క్లైయిమ్ ల గురించి ఏమైనా చర్యలు తీసుకున్నారా? అనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. 2018-19 క్లెయిమ్‌ల సంఖ్య 9,09,166 ఉండగా రూ. 2,713 కోట్లు, 2019-20 క్లైయిమ్ ల సంఖ్య 9,39,160 ఉండగా రూ. 61,051 కోట్లు, , 2020-21 క్లైయిమ్ ల సంఖ్య 10, 08,332 కాగా రూ. రూ.70,722 కోట్లు, 2021-22 క్లైయిమ్ ల సంఖ్య 10,39,323 కాగా రూ. 74,718 కోట్లు, 2022-23 ఆర్థిక సంవత్సరాల్లో క్లెయిమ్‌ల సంఖ్య 10,46,163గా ఉండగా రూ.80,455 కోట్లు పెండింగ్ లో ఉంది.
రోడ్డు ప్రమాదాల్లో బీమా క్లైయిమ్ ల మొత్తాన్ని అర్హత ఉన్నా పొందేందుకు సుధీర్ఘ సమయం నాలుగు సంవత్సరాలు పడుతోంది. 2022–23కు సంబంధించిన కేసుల్లో ఇప్పటివరకు 29 శాతం కేసులకు మాత్రమే పరిహారం అందింది. ఇంకా 71 శాతం పరిహారం కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి ఉంది.