ఈస్ట్ కమాండర్ జనరల్ మనోజ్ పాండే పదవి కాలం పొడిగింపు
Extension of East Commander General Manoj Pandey's tenure
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఈస్ట్ కమాండర్ జనరల్ మనోజ్ పాండే పదవిని మరో నెలపాటు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ ఆదివారం నిర్ణయం తీసుకుంది. మనోజ్ పాండే ఈశాన్య రాష్ట్రాలైన సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో రక్షణ కమాండర్ గా విధులు కేటాయించారు.
అంతకుముందు మనోజ్ పాండే అండమాన్ – నికోబార్ కమాండ్ కమాండర్-ఇన్-చీఫ్ పదవిలో సేవలందించారు. పాండే మే 31నే పదవీ విరమణ చేయనుండగా కేబినెట్ నియామకాల కమిటీ నిర్ణయంతో మరో నెల సర్వీసును పొడిగించినట్లయ్యింది. దీంతో పాండే ఈ పదవిలో జూన్ 30 వరకు కొనసాగనున్నారు.
పాండే ఆర్మీలో పలు కీలక బాధ్యతలను పోషించారు. సాయుధ,పదాతిదళాల్లో సేవలందించారు. ఈయన ఐక్యరాజ్యసమితి మిషన్‌లో చీఫ్ ఇంజనీర్‌గా కూడా భారత్ తరఫున పనిచేశాడు. దేశానికి తన 37 సంవత్సరాల విశిష్ట సేవలందించిన పాండే ఆపరేషన్ విజయ్, ఆపరేషన్ పరాక్రమ్‌లో పేరు ప్రఖ్యాతులు సాధించారు.