బలూచ్‌లో ఆత్మాహుతి దాడి చైనీయులతో సహా ఆరుగురు మృతి
పాక్– చైనా ఎకనామిక్కారిడార్పై కమ్ముకుంటున్న నీలినీడలు
ఢిల్లీ: వాయువ్య పాక్ బలూచిస్థాన్‌లోని ఖైబర్ ఫంక్తువ్వాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఒక జవాన్సహా ఐదుగురు చైనా జాతీయులు మృతిచెందారు. మంగళవారం వేకువజామున రెండవ అతిపెద్ద నావికా స్థావరంపై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి దిగారు. షాంగ్లాలోని బిషమ్ తహసిల్‌లో పేలుడు పదార్థాలతో నిండిన వాహనం మరొక వాహనాన్ని ఢీకొట్టింది, ఆ తర్వాత భారీ పేలుడు సంభవించింది. పేలుడు అనంతరం చైనా జాతీయులకు చెందిన వాహనం లోయలో పడి కాలి బూడిదయ్యింది. పేలుడుకు ఉపయోగించిన వాహనం పూర్తిగా కాలి బూడిదయింది. కాగా అప్రమత్తమైన భద్రతా బలగాలు నలుగురు ఉగ్రవాదులను హతమార్చాయి.
కాగా దాడికి పాల్పడింది తామేనని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. ఇటీవలే పాక్– చైనా ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ పేరిట ఉగ్ర సంస్థ పలు దాడులకు పాల్పడుతోంది. బలూచిస్థాన్‌ను ప్రత్యేక దేశంగా ప్రకటించాలని ఎన్నోయేళ్లుగా ఇక్కడి ప్రజలు పాక్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. పాక్ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనలో పూర్తిగా విఫలమవుతుండడమే గాక, కోతలు కూడా విధిస్తుండడంతో బలూచ్ వాసులకు ఈ నిర్ణయం మింగుడు పడడం లేదు. ఈ నేపథ్యంలో పాక్ ప్రభుత్వం, బలూచ్ ప్రజల మధ్య తీవ్ర వైషమ్యాలు తలెత్తాయి.
మరో వైపు పాక్‌తో చేతులు కలిపి భారత్‌ను ఇరకాటంలోకి నెట్టాలన్న చైనా భారీగా పెట్టుబడులు పెట్టింది. పాక్–చైనా ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టుల కోసం ఒప్పందాలు చేసుకొని నిర్మాణాలను చేపడుతుతోంది. బలూచ్‌కు దగ్గరగా ఈ ప్రాజెక్టులు వెళుతుండడంతో ఇక్కడి వాసులకు ఈ చర్యలు మరింత ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. ప్రాజెక్టులపై యూటర్న్ తీసుకుందామంటే.. పాక్ చైనా పెట్టిన పెట్టుబడిపై చేతులేత్తేసేలా ఉంది. ప్రాజెక్టును ముందుకు తీసుకువెళదామంటే ఇప్పుడు పూర్తి చేసినా, భవిష్యత్‌లో ఆయా ప్రాజెక్టుల భవితవ్యంపై నీలినీడలు కమ్ముకుంటాయన్న ఆందోళనలు చైనా ప్రభుత్వంలో వ్యక్తం అవుతున్నాయి. మార్చి 20న చైనా చేపట్టిన గ్వాదర్పోర్ట్ నిర్మాణ పనుల్లో కూడా బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ దాడులు చేసిన విషయం విదితమే.